చిట్వేల్ విద్యార్థుల సేవా స్పూర్తి
పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్య భవిష్యత్తు!
NEWS Sep 20,2025 09:26 pm
“స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” లో భాగంగా జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పరిశుభ్రతా కార్యక్రమం జరిగింది. ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు ఆధ్వర్యంలో విద్యార్థులు చెత్త, పిచ్చిమొక్కలు తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. వర్షాకాలంలో వ్యాధుల నివారణకు శుభ్రమైన ఆహారం, మరిగించిన నీరు అవసరమని దుర్గరాజు సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.