'ప్రతి విద్యార్థి విజయమే మా లక్ష్యం'
NEWS Sep 20,2025 09:25 pm
విద్యార్థుల విజయమే తమ లక్ష్యమని, దాని కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు అన్నారు. ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చర్చించిన అంశాలను అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. సీనియర్ ఉపాధ్యాయులు కామాటం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఉపాధ్యాయులు సమయపాలన పాటించి ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. సమావేశం అనంతరం, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్లను పంపిణీ చేశారు.