2023 సంవత్సరానికి గాను మళయాల సినీ నటుడు మోహన్ లాల్ కు ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్రం ప్రకటించింది. పలు భాషలలో 350కి పైగా సినిమాలలో నటించారు. ఎన్నో అవార్డులు పొందారు. తన వయసు 65 ఏళ్లు. ఈనెల 23 న జరగనున్న 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా మోహన్ లాల్ గొప్ప నటుడని ప్రశంసించారు ప్రధాని మోదీ.