వైసీపీ దొంగలు శ్రీవారి సొత్తును కాజేశారు
NEWS Sep 20,2025 07:09 pm
మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ దొంగలు శ్రీవారి సొత్తును కాజేశారని అన్నారు. జనాన్ని దోచుకున్న జగన్ గ్యాంగ్ తిరుమలనూ వదల్లేదన్నారు. భూమన అండదండలతో పరకామణిని కొల్లగొట్టారని, కోట్ల సొత్తు దోచుకుని రియల్ ఎస్టేట్‌లో పెట్టారన్నారు. వాటాలు భూమన నుంచి తాడేపల్లి ప్యాలస్ వరకు వెళ్లాయన్నారు. హుండీ కానుకలు వందలకోట్లు దోచిన ఘనత వారికే దక్కిందన్నారు. ఇదే కేసును రాజీ చేసేందుకు భూమన యత్నించారన్నారు. లడ్డూను కల్తీ చేశారు, టికెట్లు అమ్ముకున్నారని, పాపమని తెలిసినా పరకామణినే దోచేశారన్నారు. అందుకే పరకామణి వీడియోలు బయట పడ్డాయన్నారు.