ఎన్నికల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
NEWS Sep 20,2025 02:21 pm
అనంతగిరి మండలంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు సాధించడానికి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మండల టీడీపీ అధ్యక్షులు అంటిపర్తి బుజ్జిబాబు అన్నారు. శివలింగపురంలో మండలంలోని 24 పంచాయతీల టీడీపీ నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బుజ్జిబాబు మాట్లాడుతూ, పార్టీ నేతలు కార్యకర్తలు త్వరగా ఎన్నికలకు సిద్ధం కావాలని, అధిక శాతం ఎంపీటీసీలు, సర్పంచులను గెలిపించి మండలంలో టీడీపీ బలాన్ని అధిష్టానానికి తెలియజేయాలని ఆదేశించారు.