గిరి విద్యార్థుల ఉన్నతి కోసం కృషి
NEWS Sep 20,2025 02:18 pm
రాష్ట్ర పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి శనివారం అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ బూరుగు గ్రామం పర్యటనలో గిరిజన విద్యార్థుల అభివృద్ధికి ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని కోరారు. ఈ సందర్బంగా, మాతృభూమి సేవాసంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, గిరిజనులకు రగ్గులు పంపిణీ చేయడమైనది. భీశెట్టి బాబ్జి మాట్లాడుతూ, రోడ్ల నిర్మాణంలో ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు.