ముందస్తు బతుకమ్మ సంబురాలు
NEWS Sep 20,2025 01:56 pm
కోరుట్ల మండలంలోని SRSP గడి ప్రాథమిక పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. బతుకమ్మను విద్యార్థినీలు రంగురంగుల పువ్వులతో అలంకరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి ఆట పాటలతో, దాండియాతో సందడి చేశారు. అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు, ఉపాధ్యాయులు పూర్ణచందర్, రాజా కుమార్, ధనలక్ష్మి, సుమలత, సరస్వతి, మాధవి, మధుసూదన్ రావు, కవిత, సరిత, విద్యార్థులు పాల్గొన్నారు.