ప్రభుత్వ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు
NEWS Sep 20,2025 07:41 pm
ఇబ్రహీంపట్నం: ఎంపీపీఎస్ వర్ష కొండ పాఠశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు తెచ్చిన రంగురంగుల పూలతో మహిళా ఉపాధ్యాయులంతా కలిసి బతుకమ్మను తయారు చేశారు. విద్యార్థులంతా తమ ఆటలు, పాటలతో బతుకమ్మలతో ఆనందంగా ఆడుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు అచ్చా విజయభాస్కర్, ఉపాధ్యాయులు రమేష్, కృష్ణంరాజు, రజిత, శరణ్య, ప్రవళిక, నవత, భూదమ్మ, రాజు, ఈశ్వర్, విద్యార్థులు పాల్గొన్నారు.