ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు
NEWS Sep 20,2025 07:40 pm
ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ పండుగ సందర్భంగా పూలతో బతుకమ్మలను తయారు చేసి బతుకమ్మ ఆటలు, పాటలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తనుగుల రమేష్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి లింగంపల్లి లక్ష్మి, ఉపాధ్యాయులు మందలోజు అశోక్, అల్లకట్టు సత్యనారాయణ, చిలుముల రాజేష్, అల్లాడి హరి ప్రసాద్, ఆడెపు నరేష్, బొల్లు శంకర్ అంగన్వాడీ టీచర్ సుందరగిరి గంగామణి ఆయమ్మ శ్యామల, విద్యార్థులు పాల్గొన్నారు.