BRS కార్యకర్త కుటుంబానికి చేయూత
NEWS Sep 20,2025 06:12 pm
ఓదెల: రూపునారాయణపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త రాపర్తి రాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాధిత కుటుంబానికి అండగా నిలిచాయి. రాజు భార్య శిరీషకు రూ.12,600 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్, ప్యాట గ్రామ అధ్యక్షులు బినవేణి పర్శరాములు గౌడ్, ఓదెల గ్రామ అధ్యక్షులు పోలోజు రమేష్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ గాజుల గణపతి గౌడ్, నాయకులు చర్లపల్లి సురేష్ గౌడ్, గడ్డం శ్యామ్, సూత్రాల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.