కొత్త పార్టీపై కవిత కామెంట్స్
NEWS Sep 20,2025 07:10 pm
తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. పార్టీ పెట్టే ముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారని, తాను కూడా అదే చేస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్లో చేరే ఆలోచన లేదన్నారు. తండ్రి పార్టీ నుంచి సస్పెండైన మొదటి కూతుర్ని నేనేనని అన్నారు. ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్ను అలెర్ట్ చేశానని ఆయన పట్టించు కోలేదన్నారు. కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్దేనని హరీష్రావు పీసీ ఘోష్ కమిషన్కు చెప్పారని ఆరపించారు.