గడి పాఠశాలకు వాటర్ ప్యూరిఫయర్
NEWS Sep 20,2025 10:30 am
కోరుట్ల: SRSP క్యాంప్ గడి ప్రాథమిక పాఠశాలకు లయన్స్ క్లబ్ ₹15 వేల విలువైన వాటర్ ప్యూరిఫయర్‌ను అందిం చారు. అడగగానే లయన్స్ క్లబ్ స్పందించి ప్యూరిఫయర్ ను అందించడం అభినందనీయమన్నారు హెడ్‌మాస్టర్ నునావత్ రాజు. లయన్స్ క్లబ్ కోరుట్ల చైర్మన్ జీవన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మి రెడ్డి, ఆర్‌సి సురేష్, జోనల్ చైర్మన్ అజయ్ రావు, మధు, గంగాధర్, జగన్, అల్లాడి ప్రవీణ్, పోతని ప్రవీణ్, నారాయ ణ గౌడ్, ఉపాధ్యాయులు పూర్ణ చందర్, రాజా కుమార్, ధనలక్ష్మి, సుమలత, సరస్వతి, మాధవి పాల్గొన్నారు.