ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు
NEWS Sep 20,2025 06:11 pm
కథలాపూర్ మండలంలోని కలదార హైస్కూల్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మను పూలతో అలంకరించి పేర్చి సాంప్రదాయ వేషధారణలో కులాలు వేసి సందడి చేశారు. రైతు నాయకుడు, పాఠశాల చైర్మన్ గడ్డం భూమారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సాంప్రదాయాల పట్ల మక్కువ పెంచుకోవాలని, పాఠశాలలో బతుకమ్మ వేడుకలు జరపడం ఆనందదాయకమని పేర్కొన్నారు.