నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ
NEWS Sep 20,2025 06:10 pm
కోనరావుపేట: నాగారం గ్రామంలోని చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ భవనంలో ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. టైలరింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, హోమ్ ఎయిడ్ హెల్త్ వంటి కోర్సులు ఈ శిక్షణలో భాగంగా ఉచితంగా నిర్వహిస్తున్నారు. ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రి అనస్తీషియా నిపుణులు డా. పూర్ణ చందర్రావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ “సడెన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు సీపీఆర్ (కార్డియోపల్మనరీ రిససిటేషన్) చాలా కీలకం. అత్యవసర సమయంలో సరైన విధంగా సీపీఆర్ చేయగలిగితే ప్రాణాలను రక్షించవచ్చు” అని పేర్కొన్నారు. ట్రస్ట్, ప్రతిమ ఫౌండేషన్ ప్రతినిధులు, శిక్షణార్థులు పాల్గొన్నారు.