నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళా
NEWS Sep 20,2025 06:08 pm
జగిత్యాల: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 23, 2025న ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ తెలిపారు. ఈ ఇంటర్వ్యూలు హైదరాబాద్‌లోని MSN లాబొరేటరీస్ సంస్థలో ప్రొడక్షన్ విభాగంలో 100 ఖాళీల భర్తీ కోసం జరుగుతాయి. కనీసం 2024 లేదా 2025లో ఇంటర్ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.