రేపు ‘మనం సైతం’ ఉచిత ఆరోగ్య శిబిరం
NEWS Sep 20,2025 11:11 am
హైదరాబాద్: నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో ‘మనం సైతం’ ఫౌండేషన్ 12వ వార్షికోత్సవం సందర్భంగా రేపు (ఆదివారం) ఉ. 9 గంటలకు ఫిల్మ్ ఛాంబర్‌లో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహిస్తారు. దర్శకుడు వివి వినాయక్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు వేణుగోపాలా చారి, కంది శ్రీనివాస్ రెడ్డి, ఫిల్మ్ ఛాంబర్ నాయకులు భరత్ భూషణ్, దాము, చదలవాడ శ్రీనివాస్ రావు, ప్రసన్నకుమార్, అశోక్ కుమార్ హాజరుకానున్నారు.