హైదరాబాద్: బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈ ఏడాది 10వేల మంది ఆడపడుచులతో బతుకమ్మ నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. సెప్టెంబర్ 28న ఎల్బీ స్టేడియంలో బతుకమ్మను 10 వేల మంది ఆడపడుచులతో నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వేడుక కోసం తీరొక్క పూలతో 52 అడుగుల బతుకమ్మను సిద్ధం చేస్తున్నారు. రేపటి నుంచి బతకమ్మ సంబురాలు ప్రారంభమవుతున్నాయి.