బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామ స్మశానవాటికలో ఉన్న బోరు గత కొంతకాలంగా పనిచేయకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరు మరణించినా సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడంలో ఆటంకాలు వస్తున్నాయని, రైతులు కూడా నీటి కోసం మరో బోరు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ పంచాయతీ వార్డు సభ్యుడు ఆకుల నాగేశ్వరరావు అధికారులు విజ్ఞప్తి చేశారు.