తెలంగాణ అస్థిత్వ వైభవం.. ఆడపడుచుల ఆరాధ్య వైభోగం.. ప్రకృతి రమణనీయత.. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీక.. తెలంగాణ బతుకమ్మ సెప్టెంబర్ 21 నుండి 30 వరకు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆశ్వయుజ మాసంలో శుద్ధ అమావాస్య (రేపు) బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. 9 రోజుల పాటు ఈ సంబరాలు జరుపుకుంటారు. వివిధ రకాల పువ్వులతో ఒక్కో రోజు ఒక్కో తీరుగా కొలుస్తారు.