క్యాప్స్ గోల్డ్ కంపెనీలో ఐటీ సోదాలు
NEWS Sep 20,2025 09:37 am
క్యాప్స్ గోల్డ్ కేసులో నాలుగోరోజు ఐటీ సోదాలు చేపట్టింది. ఏపీ, తెలంగాణ, బెంగళూరు, ముంబైలో తనిఖీలు జరిపింది. ఈ ఒక్క ఏడాదిలోనే రూ. 20 వేల కోట్లకు పైగా లావాదేవీలు జరిపినట్లు గుర్తించింది. క్యాప్స్ గోల్డ్ యజమానులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించింది. రూ.50 లక్షలు, గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం చేసుకుని, బ్యాంక్ లాకర్లను పరిశీలించింది. ట్యాక్స్ చెల్లింపులపై ఇప్పటికే కంపెనీ డైరెక్టర్ చందా సుధీన్ ను ఆరా తీసింది.ఈరోజు చందా శ్రీనివాస్‌ను ప్రశ్నించనుంది ఐటీ.