కూటమి సర్కార్ నుంచి నాకు ప్రాణహాని
NEWS Sep 20,2025 09:32 am
ప్రజాశాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కూటమి సర్కార్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. నా అన్న భార్య ఎస్తేరు రాణికి నా చారిటీస్ అప్ప చెప్పాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. న్యాయమూర్తులు చంద్రబాబుకి అమ్ముడు పోయారని సంచలన ఆరోపణలు చేశారు. చివరకు నా లాయర్లను బాబు మేనేజ్ చేశాడని అన్నారు. నారా లోకేష్ ఇదంతా దగ్గరుండి నడిపిస్తున్నాడని పేర్కొన్నారు. దీన్ని నేను ఉపేక్షించను, సుప్రీంకోర్టులో తేల్చుకుంటానని స్పష్టం చేశారు.