సంజూ శాంసన్ సూపర్ ఇండియా జోర్దార్
NEWS Sep 20,2025 08:27 am
ఆసియా కప్ 2025 మెగా టోర్నీలో భాగంగా అబుదాబి వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో టీమిండియా మరో విజయాన్ని నమోదు చేసింది. జట్టుకు వరుసగా ఇది మూడో గెలుపు . కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో 188 రన్స్ చేసింది. సంజూ శాంసన్ 56 రన్స్ చేయగా, జితేష్ శర్మ, పటేల్, తిలక్ వర్మలు తమదైన శైలిలో రాణించారు. అనంతరం బరిలోకి దిగి ఓమన్ 4 వికెట్లు కోల్పోయి 167 రన్స్ కే పరిమితమైంది. దీంతో ఇండియా 21 రన్స్ తేడాతో విజయం సాధించింది.