ట్రాన్స్‌జెండర్లకు పండుగ కానుకగా చీరల పంపిణీ
NEWS Sep 20,2025 10:33 am
కామారెడ్డి: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి కాంగ్రెస్ కార్యాలయంలో 20మంది ట్రాన్స్‌జెండర్లకు చీరలను అందజేశారు. పండుగలు సమాజం మొత్తం సంబరాలు కావాలని, ప్రతి ఒక్కరికి ఆనందం పంచడం మన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంపరి లతా శ్రీనివాస్, జూలూరి సుధాకర్, చాట్ల వంశీ, తాటి లావణ్య ప్రసాద్, మామిండ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.