అనకాపల్లి జిల్లాలో రైతులకు యూరియా పంపిణీ
NEWS Sep 20,2025 10:34 am
అనకాపల్లి: జిల్లాలో ఇప్పటివరకు 13,111 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రావు శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం 530 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉండగా, మరో 300 మెట్రిక్ టన్నులను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.