మాధవరావు దేశాయికి పరామర్శలు
NEWS Sep 20,2025 10:36 am
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మాజీ జెడ్పీటీసీ మాధవరావు దేశాయి తల్లి ఇటీవల మృతిచెందడంతో పలువురు నేతలు వారి కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్ర ఆర్యక్షత్రియ సంఘం గౌరవ అధ్యక్షుడు తానాజీ రావు, సదాశివనగర్ మాజీ జెడ్పీటీసీ రాజేశ్వరరావు, గాంధారి BRS అధ్యక్షుడు శివాజీ రావు, జుక్కల్ మాజీ జెడ్పీటీసీ దాదా రావు, జుక్కల్ మండల బీజేపీ అధ్యక్షుడు శివాజీ రావు, చిన్నడిగి మాజీ సర్పంచ్ శివాజీ రావు, కౌలాస్ నాలనీటి సంఘం అధ్యక్షుడు విజయ్ పాటిల్, జుక్కల్ బీజేవై అధ్యక్షుడు మారుతి ఆయిల్వార్, ధర్మచవాన్ లు కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థించారు.