పార్టీ మార్పు ప్రచారంపై ఈటల ఖండన
NEWS Sep 19,2025 10:48 pm
పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఖండించారు. “నేను మాటలు మార్చే, పార్టీలు మారే వ్యక్తిని కాదు. పార్టీ మారడం జీవితంలో గొప్ప నిర్ణయం, పెద్ద కారణం ఉండాలి. టీఆర్‌ఎస్ నుంచి బయటికి పంపించగానే బీజేపీలో చేరాను తప్ప నా అంతట నేను రాలేదు” అని స్పష్టం చేశారు. వ్యక్తిత్వ హననం చేయొద్దని, పదే పదే శీల పరీక్షలు చేయడం సరికాదని ఈటల విజ్ఞప్తి చేశారు.