ఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండ గ్రామంలో ఆవాస్ యోజన సమాచారాన్ని ఆన్లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను ఎంపీడీవో మహ్మద్ సలీం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు రెండు రోజులలోగా సంబంధిత సమాచారాన్ని ఆన్లైన్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ పాల్గొన్నారు.