కండువా కప్పితే పార్టీ మారినట్టా : సీఎం
NEWS Sep 19,2025 08:57 pm
ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదన్నారు. ఇవాళ కూడా చాలామందికి కండువాలు కప్పానని, కప్పిన కండువాలో ఏముందో వారికి తెలియదన్నారు. ఎవరింటికైనా వెళ్తే ఏ భోజనం పెడతారో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వేతనాల నుండి రూ.5 వేలు ఇప్పటికీ ఆ పార్టీ ఫండ్ కు వెళుతున్నాయని అన్నారు.