హరీష్ రావు అతి తెలివిగా మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పదవులు పోవడంతో తట్టుకోలేక ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ నీటి హక్కులు ఎలా కాపాడాలో మాకు తెలుసు అన్నారు. 299 టీఎంసీలు సరిపోతాయి అని రాసి ఇచ్చింది మీరు కాదా అని ప్రశ్నించారు. కృష్ణాలో 522 TMCలు ఏపీకి రాసిచ్చిన మీకు ఆలమట్టి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించామన్నారు.