తహసీల్దార్ ఆనంద్ కు ఘన సన్మానం
NEWS Sep 19,2025 08:35 pm
జగిత్యాల జిల్లా పెగడపల్లి తహసీల్దార్ గా నియమితులయిన గాలిపెల్లి ఆనంద్ కుమార్ ను శుక్రవారం తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమములో జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్యాల భూమయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజేంద్ర ప్రసాద్, అసోసియేట్ అధ్యక్షులు రాజేందర్ రావు, ప్రచార కార్యదర్శి పంగ రాజేశం, కార్యాలయ నాయబ్ తహసీల్దార్ లాస్య, గిర్ధవార్ శ్రీనివాస్, జమున, సీనియర్ సహాయకులు ఆంజనేయులు, పెగడపల్లి కార్యాలయ గ్రామ పాలన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.