ప్రతిభ కనబరిచిన సహస్ర ను అభినందించిన ఎమ్మెల్యే
NEWS Sep 19,2025 08:37 pm
ఇటీవల వరంగల్ లో జరిగిన రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ లో ద్వితీయ స్థానం సాధించిన జగిత్యాల జిల్లా కిష్టంపేట్ గ్రామానికి చెందిన మంగళరాపు సహస్ర ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి, సహస్ర ను శాలువాతో సత్కరించి అభినందించారు. ఎమ్మెల్యే వెంట నాయకులు మాజీ సర్పంచ్ లు కోల శ్రీనివాస్,శ్రీనివాస్ గౌడ్,మాజీ AMC డైరెక్టర్ తిరుపతి గౌడ్,కోచ్ రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.