బిఎన్ రోడ్డు మరమ్మతులు తక్షణమే ప్రారంభిస్తాం
NEWS Sep 19,2025 08:52 pm
రాష్ట్ర R&B చీఫ్ ఇంజనీర్(NDB) వీకే విజయశ్రీ శుక్రవారం బిఎన్ రోడ్డును పరిశీలించారు. NDBలో నిధులు మంజూరైనప్పటికీ భీమునిపట్నం- నర్సీపట్నం రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గంధవరం నుంచి రోలుగుంట వరకు బిఎన్ రోడ్డును, వడ్డాది, విజయరామరాజు పేట వంతెనలను పరిశీలించారు. బిఎన్ రోడ్డు మరమ్మతులు తక్షణమే ప్రారంభిస్తామన్నారు .