చీఫ్ ఇంజినీర్ ముందే బీఎన్ పనులు చేయలేమన్న కాంట్రాక్టర్
NEWS Sep 19,2025 08:53 pm
R&Bచీఫ్ ఇంజనీర్ (NDB) విజయశ్రీ ముందే రోడ్డు మరమ్మతులు చేయలేమని కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (NDB) నిధులతో నిర్మాణంలో ఉన్న జిల్లాలోని రోడ్లు శుక్రవారం పరిశీలించారు. బి.ఎన్ రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలును పూడ్చాలని కాంట్రాక్టర్ వెంకటేశ్వరావును ఆదేశించారు. ఇప్పటికే ఈ రోడ్డు పనులకు రూ. 10 కోట్లు వెచ్చించామని ఇంతవరకు ఈ బిల్లు ఇవ్వనందున ఇక పనులు చేయలేమన్నారు.