అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలి
సెప్టెంబర్ 25న అడ్వకేట్స్ దీక్ష
NEWS Sep 19,2025 10:06 pm
న్యాయవాదులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ, వారికి భద్రత కల్పించేందుకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ వెలువడింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 25న ఇందిరా పార్క్ వద్ద “న్యాయవాదుల న్యాయ దీక్ష” నిర్వహించనున్నట్టు తెలంగాణ జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్ ప్రకటించింది. తెలంగాణ జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన అడ్వకేట్ల సమావేశంలోరాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.