వామన్‌రావు–నాగమణి హత్య కేసు విచారణ
NEWS Sep 19,2025 10:10 pm
హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. 2021 ఫిబ్రవరి 17న కమాన్‌పూర్ మండలం కలవచర్ల వద్ద జరిగిన ఈ దారుణ హత్యపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగా పెద్దపల్లి జిల్లా కోర్టులో సీబీఐ అధికారులు హాజరై విచారణ జరిపారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను కోర్టు నమోదు చేసింది.