మరో కేసును కూడా సీబీఐకి అప్పగించేందుకు రెడీ అయ్యింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై సీబీఐకి అప్పగించింది. తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసును కూడా కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ కేసుపై విచారణ చేపట్టి కీలక ఆధారాలు సేకరించింది సిట్. పూర్తి నివేదికను సిద్దం చేసింది. మరో వైపు ఈ ఫార్ములా కార్ రేసు కూడా కొనసాగుతోంది.