వాహన మిత్ర స్కీంకు ఆమోదం
NEWS Sep 19,2025 09:20 am
చంద్రబాబు సారథ్యంలోని ఏపీ కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లు, వాహనదారులకు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు వాహన మిత్ర పథకం కింద ఈ దసరా పండుగ సందర్బంగా ఆటో డ్రైవర్లకు 15 వేల రూపాయలు ఇచ్చే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.