రాహుల్ గాంధీ ఆరోపణలు అబద్దం
NEWS Sep 19,2025 09:15 am
కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఎంపీ రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటూ చేసిన ఆరోపణలు అబద్దమని పేర్కొంది. సంస్థ నిజాయితీ, నిబద్దతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నందుకు తనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ కేంద్రీకృత సాఫ్ట్ వేర్ సాయంతో ఓట్ల చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించింది ఈసీ.