తెలంగాణ ఆర్టీసీ 7754 స్పెషల్ బస్సులు
NEWS Sep 19,2025 09:09 am
టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. బతుకమ్మ, దసరా పండుగల సందర్బంగా 7754 స్పెషల్ బస్సులు నడిపిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి అక్టోబరు 2 వరకు నడిపిస్తామన్నారు . ఇందులో 377 స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామన్నారు. పండగలకి సొంతూళ్లు వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది పడకుండా అక్టోబర్ 5, 6 తేదీల్లోనూ రద్దీకి అణుగుణంగా బస్సులు నడిపిస్తామన్నారు.