పచ్చిక బయలు కాదిది..వాటర్
NEWS Sep 19,2025 10:33 am
ఈ చిత్రంలో కనిపిస్తున్నది పచ్చిక బయలు అనుకుంటే పొరపడినట్లే. ఎందుకంటే ఇది బుచ్చయ్యపేట మండలం లోపూడి శివారు బంగారుమెట్ట గ్రామంలోని భూపతయ్య చెరువు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులో నీరు చేరింది. నీటిపై నాచు కట్టి పైపొర ఆకుపచ్చగా దర్శనమిస్తోంది. చెరువు గట్టు పైనుంచి వెళ్తున్న వారు, ప్రకృతి ప్రేమికులు చెరువును ఆసక్తిగా తిలకిస్తున్నారు.