జగిత్యాలలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం
NEWS Sep 19,2025 10:36 am
స్వచ్ఛత హి సేవ-2025లో భాగంగా జగిత్యాల మున్సిపాలిటీలో ప్రత్యేక శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని చెత్త ప్రభావిత ప్రాంతం వద్ద మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిసరాలను శుభ్రం చేసి, పరిశుభ్రత ఆవశ్యకతను వివరించారు. ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం దోహద పడుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.