సీసీ రోడ్డు మంజూరు చేయండి
NEWS Sep 19,2025 11:18 am
రాయికల్ మండలం చర్లకొండాపూర్ గ్రామ గంగపుత్ర సంఘ భవనం దగ్గర 40 మీటర్ల పొడవున సీసీ రోడ్డు మంజూరు చేయాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. వర్షాకాలంలో రోడ్డు పూర్తిగా దెబ్బతింటుందని గ్రామస్థులు తెలిపారు. ఈ కార్య క్రమంలో మాజీ సర్పంచ్ ఆర్మూరి లక్ష్మీనారాయణ, నర్సయ్య, శివ, సురేష్, నాగరాజు, లలిత, తదితరులు పాల్గొన్నారు.