కుల వృత్తులను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా మేదరి సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మారుతున్న కాలంలో ప్లాస్టిక్ వస్తువుల మోజులో పడి కుల వృత్తులను కాపాడు కోలేక పోతున్నారని అన్నారు. కుల సంఘాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.