కండ్లపల్లి మోడల్ పాఠశాలను అభివృద్ధి చేస్తాం
NEWS Sep 19,2025 11:20 am
జగిత్యాల మండలం కండ్లపల్లి మోడల్ స్కూల్ ను అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఇటీవల ఉత్తమ ఉపాధ్యా య అవార్డు పొందిన పీజీటీ జువాలజీ ఉపాధ్యా యుడు చిలుకూరి శివకృష్ణను ఆయన అభినందించారు. పాఠశాలలో సైన్స్ క్లబ్ ఏర్పాటు చేశామని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. పాఠశాల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.