రైతులు అరటి సాగుపై దృష్టి సారించాలి
NEWS Sep 19,2025 11:20 am
రైతులు వరి, పత్తి వంటి సాంప్రదాయ పంటలే కాకుండా అధిక ఆదాయం ఇచ్చే అరటి పంటను సాగు చేయాలని జిల్లా ఉద్యాన అధికారి శ్యాం ప్రసాద్ అన్నారు. జగిత్యాల (R) లక్ష్మీపూర్ గ్రామంలో అరటి పంట సాగుపై ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అరటి సాగును ప్రోత్సహించడానికి ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యాన అధికారి స్వాతి, ఉద్యాన విస్తరణాధికారి అనిల్ పాల్గొన్నారు.