రాయికల్ (M) అల్లీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి మనోజ్ రాష్ట్రస్థాయి కబట్టీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిరణ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి ఈ నెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొననున్నట్లు పీడీ కృష్ణ ప్రసాద్ తెలిపారు.