అంగన్వాడీ టీచర్లకు శిక్షణ
NEWS Sep 19,2025 11:22 am
జగిత్యాల రూరల్ పొలాస రైతు వేదికలో పోషన్ భీ పడావో భీ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు 3 రోజుల శిక్షణ నిర్వహించారు. భీమారం, మేడిపల్లి, పొలాస, కల్లెడ సెక్టర్ల టీచర్లు శిక్షణలో పాల్గొన్నారు. గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, అనీమియా నివారణ, అంగన్వాడీ సెంటర్ పనితీరు తదితర అంశాలపై అధికారులు మార్గదర్శకత్వం అందించారు. చిన్నారుల పోషణలో అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకమని అధికారులు పేర్కొన్నారు.