తల్లిదండ్రులకు సత్వర న్యాయం చేయాలి
NEWS Sep 19,2025 11:24 am
జగిత్యాల కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో దివ్యాంగుల & వయోవృద్ధుల జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ తల్లిదండ్రులను విస్మరించే కుమారులు, కోడళ్లు, వారసులకు సీనియర్ సిటిజన్స్ కమిటీ ప్రతినిధులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారిలో చైతన్యం కల్పించాలన్నారు. ఫిర్యాదులు ఇచ్చే వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల స్పందించి వారికి సత్వర న్యాయం చేయాలన్నారు.