జగిత్యాల: ఉపాధ్యాయ సర్వీసు రూల్స్ సాధన కోసం కృషి
NEWS Sep 19,2025 11:31 am
JGTLలో ఎస్టీయూ, TS జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సదానందం గౌడ్ మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ సర్వీసు రూల్స్ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. అర్హులైన ఉపాధ్యా యులకు MEO, Dy EO, డైట్, జూనియర్ లెక్చరర్ పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. PRC నివేదిక బహిర్గతం ఆలస్యం సరికాదని విమర్శించారు. ఎస్టీయూ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.