పాల్వంచ టీచర్ జ్యోతికి ప్రథమ బహుమతి
NEWS Sep 22,2025 09:21 pm
పాల్వంచ మండల స్థాయి టి.ఎల్.ఎం మేళాలో ఎంపిపిఎస్ పాలకొయ్య తండా ఉపాధ్యాయురాలు వి. జ్యోతి ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. ఈ బహుమతిని మండల విద్యాశాఖ అధికారి శ్రీరామ్మూర్తి చేతుల మీదుగా స్వీకరించారు. ఈ సందర్భంగా వి. జ్యోతి మాట్లాడుతూ, “విద్యా బోధనలో టి.ఎల్.ఎం పద్ధతి విద్యార్థుల అంతర్లీన నైపుణ్యాలను వెలికితీసి, సులభతరం చేసే మార్గం అవుతుంది” అని తెలిపారు. ఆమె విజయంపై ఎంఇఓ అభినందనలు తెలిపారు.